బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం పూర్తయ్యింది. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. చాలా మంది నయని పావని ఎలిమినేట్ అవుతుందని భావించినా నాగార్జున ఆమెను సేవ్ చేసి మెహబూబ్ ను బయటకు పంపించేశారు. దీంతో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబే.