డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమాకు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ ఇద్దరి యాక్టింగ్ వేరెలెవల్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.