గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్ ప్రెస్ కు సడన్ గా బ్రేకులు వేయడంతో భారీ కుదుపు వల్ల ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఝార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. పర్సాబాద్ సమీపంలో పూరి నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఇది గుర్తించిన లోకోపైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు.