విక్రమ్ వీర ధీర శూర..ఈ మూవీ హిట్టా ఫట్టా

చియాన్ విక్రమ్, దుషారా విజయన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వీర ధీర శూర. ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. థియేటర్స్‌ ఇష్యూ కారణంగా కాస్త ఆలస్యంగా తెలుగు టూ స్టేట్స్‌లో రిలీజ్ అయింది ఈ సినిమా.. ! మరి ఈ సినిమా ఎలా ఉంది. చియాన్ విక్రమ్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా లేదా అనేది ఈ పూర్తి రివ్యూలో చూసేద్దాం..!ఓ కిరాణా కొట్టు నడుపుకునే కాళి అలియాస్ చియాన్ విక్రమ్ తన భార్య వాణి అలియాస్ దుషారా విజయన్తో సాఫీగా జీవితం సాగిస్తుంటాడు. అయితే, అతను గతంలో పనిచేసిన పెద్దాయన అలియాస్ రవి అలియాస్ పృథ్వీ రాజ్ ఓ రోజు తన కొడుకు కణ్ణా అలియాస్ సూరజ్ వెంజరమూడుని ఎస్పీ అరుణగిరి అలియాస్ ఎస్.జె.సూర్య నుంచి కాపాడాలంటూ ప్రాధేయపడుతాడు.