అభిషేకాలు, అర్చనలూ, నైవేద్యాలు, కానుకలూ.. భక్తిని ప్రకటించడంలో ఇవన్నీ మార్గాలు. భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికున్న దగ్గరిదారులు. ఇష్టదైవానికి తృణమో పణమో సమర్పించుకుంటే ఇంకెంత పుణ్యం.. ఇంకెంత పురుషార్థం..? అందుకే… మన భక్తి సబ్జెక్ట్‌లో దేవుడి హుండీకి అంత గొప్ప ప్రయారిటీలుంటాయ్. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్లు… హుండీలో కానుకలు వేస్తుంటారు. కొందరైతే నిలువు దోపిడీ ఇస్తుంటారు.