శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరల్లో మార్పులు చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, ఇలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ స్పష్టంచేసింది. శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, రూ. 50 లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది.