వయసు మీదపడ్డాక చాలా మంది సరదాగా జీవితం వెళ్లదీయాలనుకుంటారు. మనవలు, మనవరాళ్లు, కుటుంబసభ్యులతో సుఖంగా బతకాలనుకుంటారు. కానీ జపాన్లో మాత్రం పరిస్థితి భిన్నం. వయసు మీద పడ్డ వృద్ధులంతా ఇప్పుడు జైలుకు క్యూకడుతున్నారు. చిన్న చిన్న నేరాలు చేస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలవుతున్నారు. ఒకవేళ తక్కువ శిక్షపడి త్వరగా బయటికొస్తే మరో నేరం చేసి జైలుపాలవుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కాటికి కాళ్లు చాపుకున్న వృద్ధులంతా తమ శేష జీవితం కారాగారంలోనే వెళ్లదీయాలనుకుంటున్నారు.