హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్టోబరు 26న ఇజ్రాయెల్ గాజాలో ప్రారంభించిన భూతల దాడులు అక్టోబరు 27న కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో అనేక భవనాలు కుప్ప కూలాయి. అనేకమంది చనిపోయారు. మరోవైపు వైమానిక దాడులు కూడా చేసింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో హమాస్ వైమానిక దళ అధిపతి ఇస్సామ్ అబూ రుక్బే హతమయ్యాడు. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో అతను చనిపోయినట్లు ఇజ్రాయిల్ పేర్కొంది.