ఇతను తలపై కత్తెర పెడితే మినిమం లక్ష..ఎందుకంటే..

సాధారణంగా హెయిర్‌ కటింగ్‌ కి ఎక్కువలో ఎక్కువ ఓ వెయ్యి రూపాయలు ఉంటుంది. పోనీ కాస్త మోడ్రన్‌గా చేస్తే ఓ రెండు వేలు ఇచ్చుకోవచ్చు. కానీ ఇతను తలపై కత్తెర పెడితే అక్షరాలా లక్ష చెల్లించాల్సిందే. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. మీరు విన్నది నిజమే. ఎంతకీ ఎవరాయన అనుకుంటున్నారా.. ? ఇండియాలోనే ది మోస్ట్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్‌ హకీమ్‌.ఆలీమ్‌ హకీమ్‌ కస్టమర్లంతా ఫేమస్ సెలబ్రిటీలే. పలువురు సినీ, క్రీడా ప్రముఖులు హెయిర్ స్టైలింగ్ కోసం హకీమ్ దగ్గరకు వస్తుంటారు.