తెల్లవారేసరికి నగరమంతా ఫ్లెక్సీలే.. అసలేం జరిగింది - Tv9

ఇటీవల ప్రతి చిన్న కార్యక్రమానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. శుభకార్యాలు, రాజకీయ నాయలకుల పర్యటనలు, పండుగలు, జాతరలు, ఆఖరికి ఎవరైనా చనిపోయినా ఫ్లెక్సీలు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఇదొక ట్రెండ్‌గా మారిపోయింది. సాధారణంగా ఎవరైనా వ్యక్తులు తప్పిపోతే పోస్టర్‌ వేసి అక్కడక్కడా అతికిస్తారు.. పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు. కానీ ఒక కుక్క తప్పిపోతే ఫ్లెక్సీలు పెట్టడం ఎక్కడైనా చూశారా..?