పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గోపాల్‌పూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా ఉన్న ఈ వాయుగుండం గంటకు 3 కి.మీ వేగంతో కదులుతోంది. వాయవ్యంగా కొనసాగుతూ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.