Ottలో హనుమాన్..ఆ పండగరోజే స్ట్రీమింగ్ 'Hanu Man' Gets A Ott Release Date - Tv9

థియేటర్లలో హనుమాన్‌ ప్రభంజనం తగ్గడం లేదు. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా థియేటర్ల వద్ద ఇంకా హౌస్‌ ఫుల్‌ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నార్త్ ఆడియెన్స్‌ కూడా... హనుమాన్‌ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లను దాటేసి 300 కోట్ల వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్‌ హీరో కాన్సెప్ట్‌ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించాడు. అమృతా అయ్యర్‌ కథానాయిక.