మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరుమలలో సందడి చేశారు. తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి ఆలయ అలంకరణకు అవసరమైన విరాళాన్ని అందించారు. వీరికోసం టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. ఆలయ సిబ్బంది మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు దగ్గరుండి మరీ దర్శనం కల్పించారు. స్వామి వారి నేవేద్య విరామం సమయంలో మలయప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.