బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

ఇండోనేషియా లోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపి లో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది.