Armed Men Loot Rs 18.85 Crore From Punjab National Bank In Manipur's Ukhrul -Tv9

గత కొన్ని నెలలుగా రెండు జాతుల మధ్య నెలకొన్న ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భారీ చోరీ జరిగింది. ఉఖ్రుల్‌ జిల్లాలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దుండగులు కోట్ల కొద్దీ నగదును దోచుకెళ్లారు . పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బ్యాంక్‌ మేనేజర్‌, సిబ్బంది రోజూ లావాదేవీలు, డిపాజిట్‌ కార్యకలాపాలను ముగించారు. కస్టమర్లు లోపలికి రాకుండా బ్యాంకు బయట ఉన్న మెయిన్‌ షట్టర్‌ను మూసేసి లోపల పనిచేసుకుంటున్నారు. ఆ సమయంలో సుమారు 10 మంది గుర్తు తెలియని సాయుధ దుండగుల అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించారు.