ఉగాది పంచాంగం 2025 తులా రాశివారి ఫలితాలు! వీడియో

తుల రాశి వారికి ఈ సంవత్సరం భాగ్యస్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆరవ స్థానం అయినటువంటి శత్రు స్థానంలో శని అనుకూలంగా సంచరించడం. ఇక తులా రాశి వారికి పంచమంలో రాహువు, లాభంలో కేతువు అనుకూలంగా వ్యవహరించడం చేత తులా రాశి వారికి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. తులా రాశి వారి గత కొంతకాలంగా ఏవైతే ఇబ్బందులు, సమస్యలు మీరు చూశారా ఆ సమస్యల నుండి అధికమించి బయటికి వచ్చి శుభ ఫలితాలు పొందుతారు. సంతానపరంగా ఆనందం, కుటుంబపరంగా ఆనందం స్పష్టంగా కనబడుతుంది. తులా రాశి వారికి అప్పుల బాధలు తొలగుతాయి. ఆర్థికంగా ముందుకు వెళ్తారు. తులా రాశి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఈ సంవత్సరం స్పష్టంగా ఉంది.