పాక్ ఏజెంట్ హనీ ట్రాప్‌లో భారత అధికారి

భారత్ నుంచి ఆర్మీ, రక్షణ రంగానికి చెందిన రహస్యాల కోసం దాయాది పాకిస్తాన్ అనేక ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ.. భారత్‌లోని పలువురికి మహిళలను ఎరగా వేసి.. వారి దగ్గరి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎంతో మంది ఇలా దొరికిపోగా.. తాజాగా మరోసారి ఇలాంటి హనీ ట్రాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న ఓ అమ్మాయి వలపు వలలో పడిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి.. మిలిటరీ రహస్యాలను లీక్‌ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.