మరో మహమ్మారిలా పక్షవాతం ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే..! @Tv9telugudigital

పక్షవాతం మరో మహమ్మారిలా మారనుందా అంటే అవుననే అనిపిస్తోంది. పక్షవాతంతో మరణించేవారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతూ వస్తోందంటున్నాయి నివేదికలు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మరింత పెరగవచ్చంటున్నారు నిపుణులు. పక్షవాతంతో మరణించేవారి సంఖ్య 2050 నాటికి కోటికి చేరుతుందని ప్రముఖ వైద్య పరిశోధన సంస్థ ద లాన్సెట్‌ అంచనా వేసింది. ఈ వ్యాధి కారణంగా ఏడాదికి 2.3 లక్షల కోట్ల డాలర్లు ఖర్చవుతాయని వెల్లడించింది.