వందే భారత్ ఘటనలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు దుర్మరణం @Tv9telugudigital

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లాగుడు బండిపై వెళ్తున్న ఓ కుటుంబాన్ని వేగంగా దూసుకొచ్చిన వందే భారత్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.. తన భార్యాబిడ్డలను బండిపై లాక్కెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మీరట్‌ సమీపంలోని కసమ్‌పూర్‌లోని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది.