ఇంటర్నెట్‌లో రకరకాల ఛాలెంజ్‌లు వైరల్ అవుతుంటాయి. కొందరు ఫన్నీ ఛాలెంజ్‌లు చేస్తుంటే.. మరికొందరు తమ ఓపిక, పట్టుదలను పరీక్షించే అసాధారణమైన సాహసాలను చేస్తారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యూట్యూబర్ ‘నార్మే’ ఏకంగా 38 గంటలు కదలకుండా నిలబడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నార్మే చేసిన ఈ సాహసం లైవ్‌స్ట్రీమ్‌లో చూసి ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆశ్చర్యపోయారు.