డిపెండెంట్ వీసా కింద అమెరికాకు వెళ్లిన వారిలో దాదాపు లక్ష మందికి పైగా భారతీయులు స్వీయ బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికాలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ యంత్రాంగం.. వీసా గడువు ముగిసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో హెచ్-1బీ వీసాదారులకు సంబంధించిన అంశం అనేక మంది భారతీయులను కలవరపాటుకు గురిచేస్తోంది. సుమారు లక్ష మందికిపైగా భారతీయులు అమెరికా బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. డిపెండెంట్ వీసాతో తల్లిదండ్రులతో కలిసి వెళ్లగా.. వీరి వయసు 21 ఏళ్లు నిండటమే తాజా ఆందోళనకు కారణం.