ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. కోడిగుడ్లు తిన్నాక తన కూతురు అస్వస్థతకు గురైందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు వద్దంటున్నా మధ్యాహ్న భోజన పథకం కింద గుడ్లు తినిపించారని తండ్రి పేర్కొన్నారు. తద్వారా తమ మనోభావాల్ని దెబ్బతీశారన్నారు.