దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ సహా సూపర్ ఫాస్ట్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, దీనికి కారణం ఏంటనే విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. కాజీపేట- సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. ఈ రూట్ లో సిగ్నల్ వ్యవస్థను ఆధునికీకరించే పనులు కొనసాగుతున్నాయి.