ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రియల్టర్లు, బిల్డర్ల నుంచి RRR ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. RRR అంటే రాహుల్‌, రేవంత్ రియల్‌ ఎస్టేట్‌ దందా అంటూ ఎద్దేవా చేశారు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి 6 వేల కోట్లు RRR ట్యాక్స్‌ వసూలు చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు.