Ai-generated Fake Video Of Rahul Gandhi Swearing-in As Pm Goes Viral - Tv9

ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కి చెందిన ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు అందులో వినిపిస్తోంది. ఆ వాయిస్‌కు తగ్గట్టుగా మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట ఫొటోలను జత చేసి.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు దానిని షేర్ చేశారు. ఆ రోజు త్వరలో రానుంది. జూన్‌ 4న రాహుల్ ప్రధాని అవుతారు అని క్యాప్షన్‌ జోడించారు.