బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. అయితే ప్రియుడ్ని పెళ్లాడేందుకు ఆమె రాగా అతను పరారయ్యాడు. త్రిపురలోని ధర్మానగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫుల్‌బరీలో నివసించే 34 ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాడు. వివాహితుడైన అతడు తరచుగా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ బజార్‌కు వెళ్లేవాడు.