విమానం టైరులో ఓ డెడ్‌బాడీ కలకలం రేపింది. హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో అధికారులు ఈ మృతదేహాన్ని గుర్తించారు. అమెరికాలో షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది. అయితే ఈ మృతదేహం దానిలోకి ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.