ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిందా Aadhaar Update - Tv9

ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండడంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో సారి గడువు పొడిగించింది. అప్ డేట్ చేసుకునేందుకు మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు.