నదిలో, కాల్వల్లో దిగినప్పుడు అందులోని చేపలు కాళ్లను కొరకడం సహజం. అలా చేపలు కాళ్లకు ఉన్న మురికిని మొత్తాన్ని తినేస్తాయి. అయితే ఓ చేప కొరకడం వల్ల ఓ వ్యక్తి ఏకంగా చేతినే కోల్పోయాడు. వినడానికి ఆశ్చరంగా ఉన్నా ఇది నిజం. ఈ ఘటన కేరళలోని కన్నూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని థలస్సెరికి చెందిన రాజేష్ అనే రైతు ఫిబ్రవరి 10న తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తున్నాడు.