దుబాయ్‌లోని దేవాలయంలో అల్లు అర్జున్‌ వీడియో

దుబాయ్ అబుదాబిలోని ప్రఖ్యాత హిందూ దేవాలయం స్వామి నారాయణ్ మందిర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు. శనివారం ఆలయానికి వెళ్లిన బన్నీ అక్కడి నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు అల్లు అర్జున్ కు సాదర స్వాగతం పలికారు. అనంతరం నారాయణ స్వామిని దర్శించుకున్న బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.