ప్రాణం తీసిన ఫ్రిడ్జ్ !! డోర్‌ ముట్టుకోగానే కరెంట్‌షాక్‌

ఉదయాన్నే పాలు తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టబోతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఈ విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్తులు ఫ్రిడ్జ్‌ ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో బాషా సాహెబ్‌ అనే వ్యక్తి రోజూలాగే శుక్రవారం ఉదయాన్నే పాలు తీసుకొని ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో పెడదామని డోర్‌ ఓపెన్‌ చేశాడు.