రైతన్నలను అల్లాడిస్తున్న కృష్ణ జింకలు

చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గెంతులేస్తూ పరిగెట్టే కృష్ణజింకల విన్యాసాలకు ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను చూడటానికి పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు మక్తల్‌ నియోజకవర్గ రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి.