అమెరికాలో లాస్ ఏంజెల్స్ పోలీసులు ఒక మోడల్ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో గుర్తించారు. ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. సెప్టెంబర్ 12న 31 ఏళ్ల మోడల్ మలీసా మూనీ, లాస్ ఏంజెల్స్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లోని ఫ్రిజ్‌లో శవమై కనిపించింది.