మనదగ్గర విలువైన వస్తువులు కానీ, పెద్దమొత్తంలో నగదు కానీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా దొంగలు ఎగరేసుకుపోతారు. ఇటీవల బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వారిని గమనించి వారి వద్దనుంచి డబ్బు కొట్టేసిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా బెంగళూరులో రోడ్డుమీద పార్క్ చేసిన కారులో లక్షల రూపాయల నగదును చాకచక్యంగా కొట్టేశారు దొంగలు.