ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఫ్రీ. ఈ హామీనే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కర్ణాటకలో ఈ హామీ ఫలించడంతో తెలంగాణలోనూ ఎన్నికల ప్రధానహామీగా కొనసాగింది. తెలంగాణలోనూ మహిళలు చేతిగుర్తుకు పట్టం కట్టడంతో పదేళ్ల తర్వాత ఇక్కడా కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు ఉచిత బస్సుపై పునరాలోచన చేయాల్సి ఉందంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ ప్రకటించడం సంచలనంగా మారింది.