కూల్ డ్రింక్స్. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడేవి. పిజ్జాలు, బర్గర్‌లు, బిర్యానీ, ఇతర జంక్‌ఫుడ్ తిన్న తర్వాత చాలామంది తప్పకుండా కూల్ డ్రింక్ తాగుతారు. అయితే, కూల్ డ్రింక్స్ తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేకపోగా ప్రతికూల ప్రభావాలే ఎక్కువగా ఉన్నాయట. రెగ్యులర్‌గా శీతల పానీయాలు తాగేవారు అధిక బరువు, మధుమేహం, ఇతర వ్యాధులబారిన పడతారని పలు అధ్యయనాల్లో తేలింది.