రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది

ఓ మహిళ రైలులో ప్రయాణిస్తూ కిందనున్న కాల్వలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ చివరికి ఓ చెట్టును పట్టుకుని రాత్రంతా అలాగే గడిపింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ ఖాదర్‌వలి భార్య, పిల్లలతో కలిసి నిజాంపట్నంలో ఉంటున్నారు. ఆయన భార్య జిన్నతున్నీసా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి రాత్రి విజయవాడ ట్రైన్‌లో బయలుదేరింది.