ట్రాఫిక్‌ పోలీసంటే ఇలా ఉండాలి..!

ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టం అనిపించదు. అదే నిరూపించాడు ఓ ట్రాఫిక్‌ పోలీసు. ట్రాఫిక్ పోలీసు ఉద్యోగం అంటే ఎండైనా, వానైనా నడిరోడ్డులో నిలబడి విధులు నిర్వహించాలి. విధుల్లో ఉన్నంతసేపూ నిలబడే ఉండాల్సి ఉంటుంది. అయినా ఎలాంటి విసుగు చెందకుండా ఎంతో హుషారుగా విధులు నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ ట్రాఫిక్‌ పోలీసు. ఈ ట్రాఫిక్‌ పోలీసుకు సంబంధించిన వీడియో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.