ఎ..క్క..డా.. అంటూ అప్పట్లో తెలుగు కుర్రకారును కట్టిపడేసింది. చక్కటి రూపం.. కలువ కన్నులతో బిగ్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసింది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది కాలేజీ స్టూడెంట్ గా నటించి అచ్చమైన తెలుగమ్మాయిగా అలరించింది. ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సంపాదించుకుంది శ్వేత బసు ప్రసాద్. యంగ్ హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్వేత.