తెలంగాణాలో ఈసారి 30 శాతం అధిక వర్షపాతం

తెలంగాణాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని తాజాగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, నిజామాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.