పొద్దున్నే కడుపులో ఓ కప్పు ఛాయ్ పడితే.. ఆ కిక్కే వేరబ్బా. ఇలా చాలా మంది అనుకుంటారు. ఛాయ్ అందరి జీవితాల్లో అలా ఓ భాగమైపోయింది. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఎన్ని కప్పులు తాగుతారో కూడా చెప్పలేం. రోజంతా తాగుతూనే ఉంటారు. అలాంటి చాయ్ ప్రియులకు ఇరాన్ చాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లో రాజ్యమేలిన ఇరానీ చాయ్.. ఇప్పుడు వెలవెలబోతోంది.