వియత్నాం దేశాన్ని భారీ కుంభకోణం కుదిపేస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజంగా పేరున్న మహిళ ఏకంగా లక్ష కోట్ల రూపాయల ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో ఆమె వల్ల బాధితులైన వేలాదిమంది లబోదిబోమంటున్నారు. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ వాన్ తిన్హ్ పాట్ అనే కంపెనీ ఛైర్‌పర్సన్ ట్రుయాంగ్ మైలాన్‌కు స్థానిక సైగాన్ కమర్షియల్ బ్యాంకులో దాదాపు 90 శాతం వాటా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. నకిలీ రుణ దరఖాస్తులు పెట్టి కోట్ల రూపాయల మేర డబ్బులు తీసుకున్నారు.