మూగవాడిగా నటించి తన యాక్షన్‌తో భయపెట్టిన బాబీ దియోల్‌

రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’లో మూగవాడిగా నటించి తన చేతలతోనే భయపెట్టిన నటుడు బాబీ దియోల్‌ . కనిపించేది కొద్దిసేపే అయినా అబ్రార్‌గా తన నటన, యాక్షన్‌తో అదరగొట్టాడు. అయితే, సినిమా విడుదలకు ముందు తన అత్తయ్య చనిపోవడం వల్లే సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేకపోయినట్లు తెలిపాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ దియోల్‌ మాట్లాడుతూ దర్శకుడు సందీప్‌ వంగా నుంచి ఒకరోజు మెసేజ్‌ వచ్చిందనీ, అది చూసి నిజంగా సందీప్‌ వంగానే మెసేజ్ చేశాడా? అనిపించిందని అన్నాడు.