వివాహిత మహిళల కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మహతారి వందన్ యోజన పథకం కింద ప్రముఖ నటి సన్నీ లియోన్ ప్రతి నెల రూ.1000 అందుకున్నారు. ఆమె అకౌంట్‌లోకి నేరుగా ఆ నగదు జమ అయ్యింది. ఇప్పుడీ విషయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.