ఆంధ్రప్రదేశ్‌లో మద్యానికి సంబంధించి ప్రభుత్వం మరోసారి టెండర్లకు సిద్ధమైంది. రాష్ట్రంలో 12 మద్యం ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో మందుబాబుల కోసం తీసుకొచ్చిన మరో ప్రాజెక్టు ఇది. రాష్ట్రంలోని 12 ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం స్టోర్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.