ఉక్కు సెక్టార్‌లో భారీ కొండచిలువ

ఓవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు పాములు, కొండచిలువలు జనాలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు, తోటలు నీట మునిగాయి. దీంతో ఆవాసాలు కోల్పోయిన సరీసృపాలు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇళ్లు, పశువుల పాకల్లోకి కోబ్రాలు, నాగుపాములు ప్రవేశిస్తున్నాయి.