ప్రకృతి అందాలను తిలకించిన ప్రధాని మోదీ.. ఫోటో షూట్ వీడియో వైరల్..

ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి అందమైన సహజసిద్ద ప్రదేశాలను సందర్శించారు. వాటిని తన డిజిటల్ కెమెరాలో బంధించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పోలిటికల్ హీట్ నుంచి కాస్త సేదతీరేందుకు ఈ ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఈ వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.