రాజేంద్రనగర్ సర్కిల్ పరిదిలోని హసన్ నగర్ లో ఒ భారీ కొండచిలువ సంచరించింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కొండ చిలువ జనాల్లోకి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. హసన్ నగర్ లోని అయిస్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన కొండచిలువను చూసిన జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ కొండచిలువను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు.