ఉన్నట్టుండి ఆ గ్రామంలో అలజడి రేగింది. ఆకాశం నుంచి ఓ యంత్రం ఊడి అమాంతం ఆ గ్రామంలో పడింది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామవాసుల ఉలిక్కిపడ్డారు. భయాందోళన చెందారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌లోని జల్సంగి గ్రామంలోనిదీ సీన్. జనవరి 18 శనివారం రోజున జల్సిగి గ్రామ వాసులకు ఓ వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని ఓ ఇంటిపై ఆకాశం నుంచి ఒక్కసారిగా పెద్ద యంత్రం పడింది.