వేణు స్వామి! సెలబ్రెటీ ఆస్ట్రాలజర్! సినిమా, రాజకీయ ప్రముఖుల జాతకాలను.. వారి గ్రహాల గమనాన్ని అంచనా వేస్తూ.. అడగకుండా వారి జాతకాలు చెప్పే వేణు స్వామి.. ఇప్పుడు కూడా మరో సారి అదే పని చేశారు. అల్లు అర్జున్‌కు శని గండముందని చెప్పాడు. అయితే అల్లు అర్జున్ జాతకాన్ని ఈయన రెండు రోజుల క్రితమే చెప్పినప్పటికీ.. ఇప్పుడా శని గండం టాపిక్.. ఎందుకనో నెట్టింట వైరల్ అవుతోంది.